వలస కూలీలకు టీడీపీ అండ : రావుల

by Shyam |
వలస కూలీలకు టీడీపీ అండ : రావుల
X

దిశ, మహబూబ్‌నగర్: పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ఉపాధి లేక అల్లాడిపోతున వలస కూలీలకు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అండగా నిలిచారు. టీడీపీ ఎపుడు కూడా పేదలకు అండగా ఉంటుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, ఖాదర్ పాషా అన్నారు. ఈ సందర్భంగా వారు వనపర్తి పట్టణంలో ఐస్ క్రీం అమ్ముకొని బతకడానికి ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన కూలీలకు ఆర్థిక సాయం అందచేశారు. కరోనా కారణంగా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ మూతపడటంతో వారి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో పస్తులు ఉంటున్నారని తెలుసుకున్న రావుల వారికి రూ.15వేల ఆర్థికసాయం అందచేశారు.

Tags: TDP, financial, assistance, migrant workers, mahaboobnagar

Advertisement

Next Story