- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిడ్కో ఇళ్ల కోసం టీడీపీ ఫైట్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ హయాంలో పేదల కోసం కట్టిన ఇళ్లను వెంటనే వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ తీశారు. అచ్చెనాయుడుతో కలిసి చంద్రబాబు సహా బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో టిడ్కో ఇళ్లపై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
శాసనసభ సమావేశాల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ‘‘ఏడాదికి 5లక్షల ఇళ్లు కడ్తామన్న మాట ఏమైంది..? 18నెలల్లో ఏడున్నర లక్షల ఇళ్లు కట్టారా..? ఒక్క ఇల్లు అయినా పూర్తి చేశారా..? చంద్రబాబు కట్టిన ఇళ్లు శిథిలం చేసే హక్కు మీకు ఎక్కడిది..? పేదల చేతికి అందివచ్చిన ఇళ్లు చెదలపాలు చేయవద్దు..టిడ్కో ఇళ్లకు వైసీపీ గ్రహణం వీడాలి’’ అంటూ నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన తెలియజేశారు.
Advertisement
Next Story