- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రీ పోలింగ్ చేయాలని టీడీపీ.. ఎన్నిక రద్దు చేయాలని జనసేన
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఏపీలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అంతేగాకుండా.. ఈ వ్యవహారంపై పలు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. ఇప్పటికే 12మందిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, రెండు బస్సులు సీజ్ చేశారు. తాజాగా.. అలిపిరి పీఎస్‌లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, వెస్ట్ పీఎల్‌లో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ఫిర్యాదు చేసింది. తిరుపతిలో రీ పోలింగ్‌కు తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేయగా, ఎన్నిక రద్దు చేయాలని జనసేన కోరుతోంది. అధికార వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని జనసేన ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. దీనిపై స్పందించిన వైసీపీ విపక్షాలది అసత్య ప్రచారం అని అధికార పార్టీ కొట్టిపారేస్తోంది.