- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై TCS కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ మహమ్మారి పరిస్థితుల నుంచి బయటపడుతూ దేశీయ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులు కార్యాలయానికి రావాల్సి ఉంటుందని ఉద్యోగులను కోరనున్నట్టు తెలుస్తోంది.
ఆ సమయానికి ఉద్యోగుల్లో ఎక్కువమంది కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకునే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే బహుళజాతి ఐటీ సంస్థలు 70-80 శాతం మంది తిరిగి కార్యాలయాలకు వస్తారని, థర్డ్ వేవ్ పరిణామాలను బట్టి ఇది ఎంత శాతం ఉంటుందనేది తేలనుందని స్పష్టం చేస్తున్నాయి.
‘థర్డ్ వేవ్ పరిస్థితులను అంచనా వేస్తూ ప్రస్తుత కేలండర్ ఏడాది చివర్లో లేదంటే 2022 ప్రారంభం నాటికి సుమారు 80 శాతం ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తారని ఆశిస్తున్నట్టు’ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ చెప్పారు. ఈ ప్రణాళిక అనుకున్న విధంగా జరిగితే ఐటీ పరిశ్రమలో కొత్త మార్పును తీసుకురాగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల టీసీఎస్ సంస్థ రూ. 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రాజేష్ గోపీనాథన్.. సంస్థ మార్కెట్ రూ. 15 లక్షల కోట్ల ద్వారా ఎలాంటి కొనుగోళ్లను చేపట్టే ఆలోచన లేదన్నారు. కాగా, ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 44,833 కోట్లు పెరిగి రూ. 14,20,935 కోట్లకు చేరుకుంది. దేశీయ ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టీసీఎస్ అత్యంత విలువైన సంస్థగా ఉంది.
- Tags
- It industry