- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1ఎంజీలో మెజారిటీ వాటా సొంతం చేసుకున్న టాటా డిజిటల్
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నాళ్లుగా ఆన్‌లైన్ ఫార్మా స్టార్టప్ 1ఎంజీలో మెజారిటీ వాటా కోసం టాటా సంస్థ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1ఎంజీ టెక్నాలజీ లిమిటెడ్‌లో వాటాను కొనుగోలు చేసినట్టు గురువారం సంస్థ ప్రకటించింది. ఇటీవలే ఆన్‌లైన్ కిరాణా స్టార్టప్ బిగ్‌బాస్కెట్, ఫిట్‌నెస్ స్టార్టప్ క్యూర్‌ఫిట్‌లో పెట్టుబడులు పెట్టిన టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా డిజిటల్ తన ‘సూపర్ యాప్’ కోసం దూకుడు పెంచింది. ఈ-కామర్స్ వ్యాపారంలో ఇప్పటికే ఉన్న రిలయన్స్ రిటైల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పోటీ పడేందుకు టాటా సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 1ఎంజీ కంపెనీ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ సేవలను అందిస్తోంది.
ఇందులో భాగనా ల్యాబ్ పరీక్షలు, ఆన్‌లైన్ డాక్టర్ సంప్రదింపులతో పాటు ఔషధ ఉత్పత్తులను డోర్ డెలివరీ సేవలను అందిస్తోంది. 1ఎంజీలో పెట్టుబడుల ద్వారా టాటా డిజిటల్ సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, ఈ-ఫార్మసీ, ఈ-డయగ్నస్టిక్ సహా హెల్త్‌కేర్ రంగంలో వినియోగదారులకు అవసరమైన సేవలను అందించనున్నట్టు టాటా డిజిటల్ సీఈఓ ప్రతీక్ పాల్ తెలిపారు. ప్రస్తుతం 1ఎంజీ స్టార్టప్‌లో మొత్తం మూడు డయాగ్నస్టిక్ ల్యాబ్స్‌తో సహా దేశవ్యాప్తనా 20 వేలకు పైగా సరఫరా కేంద్రాలను కలిగి ఉంది. టాటా సంస్థతో భాగస్వామ్యం తమకు మరో కీలక మైలురాయిగా ఉంటుందని 1ఎంజీ సీఈఓ ప్రశాంత్ వెల్లడించారు.