- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటా స్టీల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్‌లో డబ్బులే ఇక
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ ఉక్కు ఉత్పత్తి సంస్థ టాటా స్టీల్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌ను ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ. 270.28 కోట్ల వరకు వార్షిక బోనస్ ఇవ్వడానికి టాటా స్టీల్ యాజమాన్యం, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒప్పందం జరిగింది. సంస్థలోని అన్ని విభాగాలతో పాటు యూనిట్లలో అర్హత కలిగిన ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తించనున్నట్టు కంపెనీ వివరించింది. దీనికి సంబంధించి టాటా స్టీల్, వర్కర్స్ యూనియన్ మధ్య బుధవారమే ఒప్పందం పూర్తయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జంషెడ్ పూర్‌లో ఉన్నటువంటి వేర్వేరు డివిజన్లు రూ. 158.31 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇక, ఉద్యోగులకు అందే ఈ మొత్తం బోనస్‌లో అర్హులైన ఉద్యోగులకు కనిష్టంగా రూ. 34,920 అందనుండగా, గరిష్ఠంగా రూ. 3,59,029 లభించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Advertisement
Next Story