- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేటీపీ బ్రాండ్ల విక్రయం నిలిపివేత!
ముంబయి: కొవిడ్-19 దెబ్బతో ఖరీదైన కార్లకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్, జయెం ఆటోమోటివ్స్ సంయుక్తంగా ప్రారంభించిన జేటీపీ బ్రాండ్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. 2017లో జేటీ స్పెషల్ వెహికల్స్ అనే కంపెనీ ఏర్పాటయ్యాక టియాగో జేటీపీ, టిగోర్ జేటీపీ కార్లను అభివృద్ధి చేసి విక్రయాలు జరిపింది. ప్రయాణికుల కార్లలో అధిక సామర్థ్యం ఉన్న వెర్షన్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. అయితే, టాటా మోటార్స్, జయెం ఆటోమోటివ్స్ సంయుక్తంగా ప్రారంభించిన ఈ కంపెనీని మూసివేయడానికి ముందు జయెం ఆటోమోటివ్స్‌కు 50శాతం వాటాకు చెల్లింపులు పూర్తిచేయనున్నట్టు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. టాటా మోటార్స్, జయెం ఆటోమోటివ్స్ సంయుక్తంగా ప్రారంభమైన ఈ కంపెనీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.11.3కోట్లు, 2019-20లో రూ.5.9కోట్ల ఆదాయం నమోదైనట్టు టాటా మోటార్స్ పేర్కొంది.