- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కోపోలో నుంచి వైదొలగిన టాటా మోటార్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వాహన రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న టాటా మోటార్స్ లిమిటెడ్ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. టాటా మోటార్స్‌కు జాయింట్ వెంచర్ కంపెనీగా ఉన్న మార్కోపోలో నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్కోపోలో కంపెనీలో ఉన్న వాటా మొత్తాన్ని రూ. 99.96 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. దీనికి అవసరమైన ప్రతిపాదనలను రెగ్యులేటరీకి పంపించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
2006 ఏడాదిలో టాటా మోటార్స్, మార్కోపోలో ఎస్ఏ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఇరు కంపెనీలు కలిసి టాటా మార్కోపోలో మోటార్స్ లిమిటెడ్‌గా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ వెంచర్‌లో టాటా మోటార్స్‌కు 51 శాతం, మార్కోపోలో 49 శాతంగా నిర్ణయించాయి. ఈ జాయింట్ వెంచర్‌లో భాగంగా భారీ వాహనాలను, ప్రత్యేకంగా బస్సుల తయారీలో మెరుగైన ప్రగతిని కనబరిచింది. ప్రభుత్వ రంగ సంస్థలు 70 శాతానికి పైగా వీటి బస్సులను కొనుగోలు చేశాయి.
లో-ఫుట్‌బోర్డ్ బాడీ బిల్డింగ్‌కు అనుకూలమైన ఛాసిస్‌లను తయారు చేశాయి. ఈ క్రమంలో తాజాగా జాయింట్ వెంచర్‌ను వైదొలగాలని టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. మార్కోపోలోతో భాగస్వామ్యాన్ని కూడా రద్దు చేసుకోవాలని భావించింది. దీనికి టాటా మోటార్స్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇదివరకు కుదిరిన ఒప్పందం ప్రకారం..మార్కోపోలో కంపెనీ వాటాను జాయింట్ వెంచర్ కంపెనీకి మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం..మార్కోపోలో 49 శాతం వాటా కోసం రూ. 99.96 కొట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలో వెంచర్ కంపెనీనికి ఉన్న వాహన ఛాసిస్ తయారీ యూనిట్లను టాటా మోటార్స్ సొంతం చేసుకోనుంది.