- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాక్సీ సర్వీసుల కోసం టాటా మోటార్స్ ప్రత్యేక బ్రాండ్ ఆవిష్కరణ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్తగా కారును భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ట్యాక్సీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ‘ఎక్స్‌ప్రెస్’ పేరుతో దీన్ని తీసుకొస్తునట్టు వెల్లడించింది. ఈ విభాగంలో తక్కువ ధరలో, ప్రయాణికుల సౌకర్యం, భద్రతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని దీన్ని ఆవిష్కరిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వ్యక్తిగత అవసరాలకు, ట్యాక్సీ సర్వీసులకు వినియోగించేందుకు వీలుగా స్పష్టమైన ఎక్స్‌ప్రెస్ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర అన్నారు.
ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద త్వరలో విడుదల చేయబోయే మొదటి వాహనం ఎలక్ట్రిక్ సెడాన్ ‘ఎక్స్‌ప్రెస్-టీ’పేరుతో వస్తుందని కంపెనీ వివరించింది. సరైన బ్యాటరీ సైజు, ఫాస్ట్ ఛార్జింగ్ పరిష్కారాలతో, మెరుగైన భద్రత, ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలతో ఇది రానున్నదని, ఆకర్షణీయమైన డిజైన్‌లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా తక్కువ మెయింటెన్నెస్ ఖర్చులతో పాటు నగరాల్లో ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఈ కారు ఉంటుందని పేర్కొంది.