- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్కెట్‌లో వాటా కోసం టాటా గ్రూప్ అగ్రీమెంట్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ గతేడాది వినియోగారుల వ్యాపారాలన్నింటిని కలుపుతూ ‘సూపర్ యాప్’ను తీసుకురానున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కిరాణా స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటా కొనుగోలుకు టాటా గ్రూప్ సంస్థ అగ్రీమెంట్ చేసుకున్నట్టు సమాచారం. దీనికోసం టాటా గ్రూప్ రూ. 9,500 కోట్లను వెచ్చించినున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న బిగ్‌బాస్కెట్ కంపెనీ.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫ్రెష్ విభాగాలతో పోటీ పడుతోంది. గతేడాది కరోనా మహమ్మారి తర్వాత వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌కు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ విభాగంలో పోటీ తీవ్రమైంది. టాటా గ్రూప్ తాజా ఒప్పందంలో భాగంగా బిగ్‌బాస్కెట్ సహ-వ్యవస్థాపకుడు హరి మీనన్ఓ సహా సంస్థలోని టాప్ మేనేజ్‌మెంట్ రాబోయే మూడు నాలుగేళ్ల పాటి వారి బాధ్యతల్లో కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఒప్పందానికి సంబంధించి అగ్రీమెంట్ జరిగినట్టు టాటా గ్రూప్ కానీ, బిగ్‌బాస్కెట్ కానీ అధికారికంగా వెల్లడించలేదు.