రైతులతోనే దేశానికి ప్రయోజనం : గాంధీ మనువరాలు

by Shamantha N |
gandi grand doughter
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు మద్దతు ప్రకటిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మహత్మాగాంధీ మనువరాలు తారా గాంధీ భట్టా చర్జీ రైతు ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాజధాని సరిహద్దులోని ఘాజీపూర్ ప్రాంతానికి వెళ్లి రైతులను కలిసినట్లు BKU (భారతీయ కిసాన్ సంఘ్) మీడియా ఇన్చార్జి ధర్మేంద్ర మాలిక్ ప్రకటించారు. 84ఏళ్ల వయస్సులో ఆమె రైతుల కోసం ఇక్కడిదాకా రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తారా గాంధీ రైతులతో మాట్లాడుతూ.. ‘దేశం ప్రయోజనం మీతోనే ఉందని.. మీ వల్లే తాము, దేశం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉందని చెప్పారు’. ప్రజలు నిరసన ప్రాంతాలకు వచ్చి రైతుల కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. చివరగా తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, రైతు నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed