తాప్సీ 'లాక్ డౌన్' టైం టేబుల్ ఇదే..

by Shyam |
తాప్సీ లాక్ డౌన్ టైం టేబుల్ ఇదే..
X

హీరోయిన్ తాప్సీ పన్ను బాలీవుడ్‌లో పాతుకుపోతోంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ… ఒక్కో సినిమాతో తనలో యాక్టింగ్ స్కిల్స్ మరింత మెరుగు పరుచుకుంటోంది. ‘థప్పడ్’ సినిమాతో లేటెస్ట్ హిట్ అందుకున్నఈ భామ… లాక్ డౌన్ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నానని తెలిపింది. ఇన్నాళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని… ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్‌తో పెండింగ్‌లో ఉన్న పనులను చేసుకుంటున్నానని తెలిపింది. ఎప్పుడూ తన టైం టేబుల్ బిజీగా ఉండేలా షెడ్యూల్ చేసుకుంటానన్న తాప్సీ.. తెలుగు, తమిళ స్కిల్స్‌పై తనను తాను పరీక్షించుకుంటుందట. ఎప్పుడు స్వీయ పరిశీలన చేసుకుంటానని…. కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తానని చెబుతోంది. పెండింగ్ స్క్రిప్ట్స్ చదువుతూనే… ఇప్పటి వరకు చూడాలని అనుకుని చూడలేని సినిమాలను కవర్ చేసేందుకు లాక్ డౌన్ టైంను వినియోగించుకుంటానని చెప్పింది. ముఖ్యంగా 2019లో విడుదలైన అన్ని సినిమాలను చూసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపిన తాప్సీ…. ప్రతీ ఒక్కరికి క్రమ శిక్షణ చాలా అవసరమని చెప్పింది. మీరు కూడా టైం టేబుల్ ప్రకారం మీమీ పనులు చేసుకోవాలని అభిమానులకు సూచించింది.

‘థప్పడ్’ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న తాప్సీ…. కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ‘థప్పడ్’ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్‌ను తిరగరాసేదని అభిప్రాయపడింది. ‘హసీ దిల్ రుబా’ చిత్రంలో నటిస్తున్న భామ.. 10 రోజుల షూటింగ్ మినహా మూవీ మొత్తం పూర్తయిందని వివరించింది. కరోనా ఎఫెక్ట్‌తోనే సినిమా షూటింగ్ వాయిదా పడిందని చెప్పుకొచ్చింది. కాగా.. క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌ ‘శభాష్ మిథూ’లోనూ నటిస్తోంది తాప్సీ.

tags : Taapsee Pannu, Bollywood, Thappad, Lock Down

Advertisement

Next Story