- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ బాక్సాఫీస్ ‘టాప్’లో తాప్సీ
హీరోయిన్‌గా తెలుగులోనే ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. కెరీర్ మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ సరైన బ్రేక్ దొరకలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకోవడంతో పాటు మంచి నటిగానూ ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ.. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటోంది. ఇక 2019-2020 ఆమెకు బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పుకోవచ్చు. 2019లో ‘బద్లా’ సినిమాతో హిట్ అందుకున్న తాప్సీకి.. ఆ తర్వాతి నాలుగు చిత్రాలు కూడా విజయాన్నందించాయి. ఈ క్రమంలో 2019లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా తాప్సీ నిలవడం విశేషం. మొత్తంగా ఆమె ఒక్క సంవత్సరంలోనే రూ. 352.13 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టినట్లు విశ్లేషకులు తెలిపారు.
2019లో బిగ్ బీ అమితాబ్‌తో కలిసి తాప్సీ నటించిన ‘బద్లా’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 88 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి సినిమా గేమ్ ఓవర్ రూ. 4.68 కోట్లు రాబట్టగా, మిషన్ మంగళ్ రూ. 202.98 కోట్లు కొల్లగొట్టింది. సాండ్ కీ ఆంఖ్ 23.40 కోట్లు, థప్పడ్ 33.06 కోట్లు వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో తాప్సీ ‘హో నైస్. ఇలా జరుగుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ క్వారంటైన్‌లో నాకిది గుడ్ న్యూస్. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. థప్పడ్‌లో తాప్సీకి కోస్టార్ అయిన దియా మిర్జా.. ‘కంగ్రాట్యులేషన్స్ లైయనెస్. నువ్వు ఎంచుకున్న చాయిస్‌లతో పాటు నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది’ అని తాప్సీ ట్వీట్‌కు బదులిచ్చింది.