కొట్టే చాన్సిస్తే.. కరోనాకే ‘థప్పడ్’ అంటున్న నటి

by Shyam |
Tapsee
X

రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సామాజిక అంశాలపై తన వాయిస్ వినిపించడంలో ‘హీరోయిన్ తాప్సీ’ ముందుంటుంది. ఇక లాక్‌డౌన్‌ టైమ్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్న ఈ అందాల భామ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ‘చెంపదెబ్బ కొట్టే చాన్స్ ఇస్తే.. కరోనాను కొట్టేస్తా అంటున్న తాప్సీ.. అభిమానులు ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలని సూచిస్తోంది.

లాక్‌డౌన్‌లో గృహ హింస కేసుల సంఖ్య పెరగడంతో.. ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ కూడా షేర్ చేసింది. అలాంటి బాధిత మహిళలకు మీరిచ్చే సందేశం?

జవాబు: ఒక సమస్యపై పోరాడేందుకు ప్రతి స్త్రీ తనదైన మార్గాన్ని కలిగి ఉంటుంది. ఏదో ఒకటి చేయటం ముఖ్యం. మౌనంగా కూర్చోవడం సమస్యకు పరిష్కారం కాదు. పుట్టింటి వారు, చుట్టుపక్కల వారి హెల్ప్ తీసుకోవాలి.

‘గులాబో సీతాబో, శకుంతలాదేవి’ వంటి పెద్ద చిత్రాలతోపాటు త్వరలోనే మరికొన్ని సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతున్నాయి. నిర్మాతల నిర్ణయంతో థియేటర్ యజమానులు చాలా కోపంగా ఉన్నారు. వారి ఆగ్రహం ఎంతవరకు సముచితం?.

జవాబు: థియేటర్ యజమానులు కోపంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. వారు కోపం తెచ్చుకుంటారు.. కానీ ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయో చూడటం ముఖ్యం. సమయం, పరిస్థితి మధ్య ఉన్న ఏకైక మార్గం విజయం అంటారు కదా.

థియేటర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టేనా ?
జవాబు: ఇండియాలోని థియేటర్లకు ఎప్పుడూ ప్రమాదం ఉండదని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. మా సినిమాలు చాలా పెద్ద స్క్రీన్ కోసమే నిర్మించబడతాయి. అందరూ కలిసి వెండితెరపై చూసేందుకే తెరకెక్కుతాయి.

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ జీతాల్లో కోత విధిస్తున్నారు. స్టార్స్ కూడా రెమ్యూనరేషన్‌లో అలాంటి కోతలను ఎదుర్కొంటున్నారా? సమీప భవిష్యత్తులో మీ రెమ్యునరేషన్ కూడా తగ్గించబడుతుందా?
జవాబు:షూట్ లేనందున, జీతం అందుబాటులో లేదు. మా రెమ్యునరేషన్‌లో కూడా కోత ఉంటుందంటే నేను సిద్ధంగా ఉన్నాను.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో మీరు జీవితాంతం మరచిపోలేని విచారకర సంఘటనలు ఏమైనా ఉన్నాయా ?
జవాబు: లాక్‌డౌన్‌లో అలాంటివి చూసి చాలా బాధపడ్డాను. సొంతూరు చేరుకునేందుకు గర్భిణీ మైళ్ల దూరం నడవడం.. కొడుకు తన వృద్ధురాలైన తల్లిని భుజం మీద మోసుకెళ్ళడం లాంటి దృశ్యాలు చూసి కలత చెందాను.

బాలీవుడ్‌లో బయటి వ్యక్తి, అంతర్గత వ్యక్తికి మధ్య వ్యత్యాసం గురించి తరచూ మాట్లాడతారు. ఇప్పటికీ అలాంటి వ్యత్యాసం ఉందా లేదా ఇది సమస్య మాత్రమేనా?

జవాబు: వ్యత్యాసం ఉంది. ఎప్పటికీ ఉంటుంది. కానీ వ్యత్యాసం ఎల్లప్పుడూ చెడ్డది కాదు. ఒక వైపు, ఈ వ్యత్యాసం కారణంగా మనకు తగినన్ని సినిమాలు లభించవు. కానీ ఒక్కోసారి ఈ వ్యత్యాసమే నిజమైన ప్రేమను అందిస్తుంది.

ఈ పోటీ పరిశ్రమలో మీ ఉనికిని కొనసాగించి, నిరంతర మిమ్మల్ని విజయం వైపు నడిపించే మంత్రం ఏమిటి?
జవాబు: విజయాల నిచ్చెన ఎక్కేటప్పుడు మీరు పైకి వేస్తున్న అడుగులు గుర్తుంచుకోండి. ఒకవేళ కింద పడినా సరే నిచ్చెన మళ్లీ ఎలా ఎక్కాలో నేర్పుతుంది.

మీ జీవితంలో ‘ప్రత్యేక’ వ్యక్తి ఉన్నారని కొద్ది రోజుల క్రితమే చెప్పి చాలా మంది యువకుల హృదయాలను మీరు విచ్ఛిన్నం చేశారు.. నిజమేనా?
జవాబు: ఎవరూ లేనప్పుడు, ఎవరూ ఎందుకు లేరని ? ఎంతకాలం ఒంటరిగా ఉంటుందని అందరూ ఆందోళన చెందుతారు. ఒకవేళ ఉన్నారని చెప్తే ఇలా ప్రశ్నిస్తారు. నేనేం చేయాలి..??

మీరు ఈ సమయంలో చెంపదెబ్బ కొట్టాలనుకుంటే ఎవరిని కొడతారు?
జవాబు: కరోనాను..

గత నెల, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశాన్ని ఎగతాళి చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘కొత్త పని ఇక్కడ ఉంది.. అవును అవును !’ అంటూ. మీ ట్వీట్ ద్వారా మోడీ సందేశాన్ని మీరు ఎగతాళి చేశారని అర్థం. ప్రజలు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నారా?
జవాబు: అది అర్థం చేసుకునే తత్వం, ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. నేను సంతోషంగా రాశాను, ఎందుకంటే అది నా స్వభావం. మిగతావారంతా తమ ఆలోచన ప్రకారం వారు అనుకున్నది రాశారు.

ప్రస్తుతానికి మీరిచ్చే సూచనలు ? షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి ? చిత్ర పరిశ్రమలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయి ?

జవాబు: సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఇంకా టైమ్ పడుతుందని అభిప్రాయ పడుతున్నాను. షూటింగ్ ఎప్పుడు, ఎలా జరుగుతుందనేది తెలియదు.

వివిధ దేశాల్లో ఉన్న మీ స్నేహితులందరూ సురక్షితంగా ఉన్నారా ?
జవాబు: ఇప్పటి వరకు అందరూ క్షేమమే. ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.

Advertisement

Next Story