- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు..

దిశ, క్రైమ్ బ్యూరో : మహిళను లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకివెళితే.. ఏపీ రాష్ట్రం వైజాగ్‌కు చెందిన తప్పెట్ల భగవాన్ (21) మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. గుర్తు తెలియని మహిళకు వాట్సాప్‌లో హాయ్ అని మెస్సేజ్ చేశాడు. ఆ మెస్సేజ్‌కు బాధితురాలు స్పందించడంతో తరుచూ మాట్లాడుకుంటూ స్నేహితులుగా మారారు. కొద్ది రోజుల తర్వాత బాధితురాలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ను కనుగొని చాటింగ్, వీడియో కాల్ చేశాడు. ఈ సందర్భంగా వీడియో కాల్‌తో మాట్లాడుతున్నపుడు స్క్రీన్ షాట్ తీసి, న్యూడ్ వీడియో కాల్ చేయాలని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
లేదంటే, స్క్రీన్ షాట్ తీసిన వీడియో కాల్ ఫోటోలు, చాట్ చేసుకున్న మెస్సేజ్ లను తల్లిదండ్రులకు సెండ్ చేస్తానని బెదిరించాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతుందని భయపడిన బాధితురాలు న్యూడ్ వీడియో కాల్ చేసింది. ఆ సమయంలోనూ తన మొబైల్‌లో స్క్రీన్ రికార్డర్ చేశాడు. అనంతరం తనతో సెక్స్‌కు అంగీకరించాలంటూ వేధింపులకు గురిచేస్తూ అసభ్యకరమైన ఫోటోలు, అభ్యంతకరమైన భాషతో బెదిరింపులకు దిగాడు. అంతే కాదు, నా కోరికను అంగీకరించకుంటే నా వద్ద ఉన్న వీడియో, ఫోటోలను కుటుంసభ్యులకు, ఫ్రెండ్స్‌కు అప్ లోడ్ చేస్తానంటూ వేధించసాగాడు. ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గతంలోనూ అతనిపై ఈ తరహా కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా రాచకొండ క్రైమ్ డీసీపీ పి.యాదగిరి, అడిషనల్ డీసీపీ డి. శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్, ఇన్ స్పెక్టర్ ఎం.శంకర్ లను సీపీ అభినందించారు.