వృద్ధుడి కడుపు చూసి షాకైన డాక్టర్లు

by vinod kumar |
వృద్ధుడి కడుపు చూసి షాకైన డాక్టర్లు
X

దిశ, వెబ్ డెస్క్ :సాధారణంగా మనుషుల కడుపుల్లో నులిపురుగులు పెరుగుతుంటాయి. అవి మహా ఉంటే అర అంగుళం సైజులో ఉంటాయి. కానీ వృద్ధుడి కడుపులో 59 అడుగులు 18మీటర్ల నులిపురుగు చూసి వైద్యులు షాక్ అయ్యారు. అయితే ఈ ఘటన థాయ్ లాండ్‌లోని నాంగ్ఖాయ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 67 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన కడుపునొప్పి, బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. అలాగే ఆపానవాయువు సమస్యతో సతమవుతున్నట్లు వైద్యులకు తెలిపాడు.

అనతరం వృద్ధుడికి పరీక్షలు చేసిన వైద్యలు అతడి పొట్టలో భారీ నులిపురుగు, 28 నులిపురుగు గుడ్లను ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఆ భారీ నులిపురుగును మలద్వారం ద్వారా బయటకు పంపేందుకు మందులు ఇచ్చారు. దీంతో అది కాస్తా బయటకు వచ్చింది. దాని పొడవు 59 అడుగులు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గత 50 ఏళ్లలో థాయిలాండ్‌లో బయటపడిన అతి పెద్ద నులిపురుగు ఇదేనని వైద్యులు తెలిపారు. పచ్చి మాంసాన్ని ఉడకని ఆహారంతీసుకోవడం వలన ఇవి ఏర్పాడుతాయని ఇకనైన మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు బాధితుడికి తెలిపారు. అనతరం వారి కుటుంబసభ్యలు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed