- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను ఆదుకోవాలి: తమ్మినేని
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి, వరి రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా తూర్పు బాక పంచాయతీ పరిధిలో నీటమునిగిన పత్తి చేలను పరిశీలించారు. అనంతరం రేగుబల్లి, కాశీనగరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట మునిగిన పత్తి పంటలకు ఎకరాకు రూ.15 వేలు, వరి అయితే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గోదావరి ముంపు ప్రాంత రైతులకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అన్నవరపు కనకయ్య, నున్న నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు యలమంచి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story