- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ల వేతనాలను 15% పెంచాలి: తమ్మినేని
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌లో కూడా సేవలందిస్తున్న డాక్టర్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గత సంవత్సరమే ఈ హామీనిచ్చినప్పటికీ ప్రభుత్వం అమలు జరపలేదని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో అసోషియేషన్‌లు మే 26 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయని, సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అందులో స్పష్టం చేశారు. కరోనా విధుల్లో వున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని డాక్టర్లకు గౌరవ వేతనం పెంచడం, వారి కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Advertisement
Next Story