‘‘బడ్జెట్‌‌కు లక్ష్యం.. దిశానిర్దేశం లేవు’’

by Shyam |
‘‘బడ్జెట్‌‌కు లక్ష్యం.. దిశానిర్దేశం లేవు’’
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌కు ఒక లక్ష్యం.. దిశానిర్దేశం లేదని.. సీపీఐ(ఎం) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో బడ్జెట్ పై మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేసే బడ్జెట్ కాకుండా రాష్ట్రభివృద్ధికి తోడ్పడే విధంగా బడ్జెట్ ఉండాలన్నారు. కానీ, గత బడ్జెట్ పై రూ, 36,209 కోట్లు పెంచినప్పటికీ బడ్జెట్ ద్రవ్యలోటు 33,191 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్‌లో రూ.30నుంచి 39వేల కోట్లు వాస్తవ ఆదాయానికి కోత పడుతుందన్నారు. ఈ కోతను సరిచేసుకోవడానికి దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, పాఠశాల విద్య వంటి పద్దుల్లో కోత పెడుతున్నరని ఆరోపించారు. ప్రజలపై అధికంగా పన్నుల భారం మోపుతున్నరన్నాని విమర్శలు చేశారు. ఆ భారాన్ని రూ.65వేల కోట్ల నుంచి 85వేల కోట్లకు పెంచడం జరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళల అభివృద్ధికి కేటాయింపులు పెరగలేదన్నారు. ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గొప్పలు చెప్పడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదు. బడ్జెట్ అంటే సామాజిక విలువల స్వరూపం అని గుర్తించాలని తమ్మినేని సూచించారు.

tag: Tammineni Veerabhadram, comments, budget

Advertisement

Next Story