బంగ్లాదేశ్ జట్టు నుంచి తమీమ్ ఇక్బాల్ ఔట్

by Shyam |
బంగ్లాదేశ్ జట్టు నుంచి తమీమ్ ఇక్బాల్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తమీమ్ ఇక్చాబ్ ఎడమ చేతి బొటన వేలు విరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఖాట్మాండులో జరిగిన ఒక లీగ్ మ్యాచ్ సందర్భంగా తమీమ్ గాయపడ్డాడు. అతడికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించగా వేలు విరిగినట్లు గుర్తించారు. వేలికి చాలా కాలం క్రితమే గాయం అయినా.. ఇటీవల వాపు కనిపించడంతో మరోసారి ఎక్స్‌రే తీయించారు. అందులో ఫ్రాక్చర్‌ను గుర్తించారు. అంతకు ముందు మోకాలికి గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. తాజాగా వేలి గాయం కారణంగా కీలకమైన పాకిస్తాన్ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. తొలి టెస్టు నవంబర్ 26 నుంచి చత్తోగ్రామ్‌లో, 2వ టెస్టు డిసెంబర్ 4 నుంచి ఢాకాలో ప్రారంభం కానున్నది.

Advertisement

Next Story

Most Viewed