- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాసిరకం బియ్యంతో ఎమ్మెల్యేకు హారతి.. మీరే మనుషులా మేము కాదా..!
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన లీడర్ల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ మరో చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఓట్లు అడిగేందుకు తండాలయ్ గ్రామానికి అధికార పార్టీ (AIDMK) ఎమ్మెల్యే మాణిక్కం వెళ్లాడు. అతనికి నాసిరకం ఆహారాన్ని ప్లేట్లో వడ్డించి హారతిస్తూ గ్రామంలోని మహిళలు వెల్‌కమ్ చెప్పారు.
ప్రస్తుతం తాము ఈ ఆహారాన్నే తింటున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థలో అందించే బియ్యం క్వాలిటీ నాసిరకంగా ఉందని పైవిధంగా నిరసన తెలిపారు. నాసిరకం బియ్యం పంపిణీ చేస్తున్న అధికారుల తీరుపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ మీలాగే మేము కూడా మనుషులం.. ఎలా తినాలి.. ఈ ఆహారాన్ని’’ అంటూ ఎమ్మెల్యేను కడిగిపారేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామంలోని మహిళలు చూపిన తెగువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.