- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తమిళనాడు ఓటర్లకు సీల్డ్ కవర్, గూగుల్ పే ట్రాన్స్‌ఫర్స్..!
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో ఆదివారం ప్రచారానికి తెరపడింది. ఎక్కడికక్కడా మైకులు మూగబోయాయి. పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో పలు పార్టీలు పంపిణీ ప్రక్రియను షురూ చేశాయి. అధికార పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తిరునల్లార్ ప్రాంతంలోని ఓటర్లకు సీల్డ్ కవర్ గిఫ్ట్స్‌ను పంచుతోంది. అందులో రూ.2వేల నగదుతో పాటు గ్రాము బంగారం కూడా పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలోని రాణిపేటలో అన్నాడీఎంకే అభ్యర్థి సుకుమార్ ఇంట్లో రూ.92లక్షల నగదు, 25మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఓటర్లకు సంబంధించిన గూగుల్ పే జాబితా కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. వాటికి చెందిన పత్రాలను ప్లైయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
Next Story