నాకు బీపీ, షుగర్‌ ఉన్నాయి.. దయచేసి నన్ను గెలిపించండి

by Shamantha N |   ( Updated:2021-03-25 23:05:58.0  )
నాకు బీపీ, షుగర్‌ ఉన్నాయి.. దయచేసి నన్ను గెలిపించండి
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అభ్యర్థులు ప్రచార జోరును ముమ్మరం చేసారు. ఎన్నికల ప్రచారం అంటే అందరికి తెలిసిందే. ఎక్కడలేని పనులు , ఎక్కడలేని హామీలను చేస్తూ అభ్యర్థులు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇక తాజాగా ఒక ఆరోగ్య శాఖామంత్రి ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్య సమస్యలను బయటపెట్టి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్‌ ఇప్పటికే రెండు సార్లు గెలవగా.. మూడో సారి గెలవడానికి ప్రచారం ప్రారంభించాడు. అయితే ఈ ప్రచారంలో తనకు బీపీ, షుగర్ ఉన్నాయని.. దయచేసి తనను ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు.

ఇక ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్ధులు విరుచుకుపడ్డారు. ఒక ఆరోగ్య శాఖామంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనీ సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ విషయమై విజయ్ భాస్కర్ స్పందిస్తూ వాస్తవిక జీవితంలో విశ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్‌ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఎంత మంత్రి సమర్ధించుకున్నా ఇన్ని ఆరోగ్య సమస్యలున్న ఈయన ఆరోగ్య మంత్రి ఎలా అయ్యాడు అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story