- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్యకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలు
దిశ వెబ్ డెస్క్: హీరో సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్‌మగళ్ వందాల్’ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జ్యోతిక లీడ్ రోల్ పోషించింది. ఎన్నో సినిమాల్లానే కరోనా ప్రభావంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దీంతో సూర్య ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో వివాదం మొదలైంది. థియేటర్స్ సంఘం యజమానులు సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై సూర్య నిర్మాతల నుండి సపోర్ట్ లభించింది.
సినిమాలు విడుదల కాకపోవడంతో… నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారన్న విషయం అందరికే తెలిసిందే. అందువల్ల సూర్య కూడా తన సినిమాను డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా విడుదల చేయాలని భావించారు. దీనిపై థియేటర్ యజమానుల సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తమిళ నిర్మాతలు కొంతమంది సూర్యకు అండగా నిలిచారు. ఇలా డిజిటల్ ప్లాట్ ఫాంపై చిన్న సినిమాలను విడుదల చేయడం వల్ల ఆయా నిర్మాతలకు పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ‘కరోనా ప్రభావంతో చిన్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిత్రాలను ఆన్‌లైన్ విడుదల చేయడానికి డిజిటల్ సంస్థలు ముందుకు రావడం మంచి పరిణామం. చిన్న నిర్మాతలకు మంచి అవకాశం. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు చేస్తామని. చిన్న, మధ్య తరహా సినిమాలను కొనుగోలు చేయడానికి ఓటీటీ సంస్థల్ని కోరుతామని’ సదరు నిర్మాతలు తెలిపారు.
tags: hero surya, producers, ott, digital platform, release