బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు : సునయన

by Shyam |
బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు : సునయన
X

తమిళ హీరోయిన్ సునయన.. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా పాపులర్ కాగా.. ఇందులో పార్టిసిపేట్ చేసిన కొందరు ఆర్టిస్టులకు స్పెషల్ ఇమేజ్ వస్తే, ఇంకొందరి ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఫైనల్‌గా పాపులారిటీ మాత్రం బాగానే వచ్చేసింది. ఈ క్రమంలో సునయన బిగ్ బాస్‌లో పాల్గొంటుందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఎలాంటి షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ కారణంగా తన సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడగా.. ఎప్పుడు స్టార్ట్ అవుతాయో క్లారిటీ లేదని చెప్పింది. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే పాల్గొనాల్సి ఉంటుందని.. బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేస్తే సినిమా చిత్రీకరణలో ఎలా పాల్గొంటానని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది భామ.

Advertisement

Next Story