శేఖర్ కమ్ములను కలిసిన ఎగ్జైట్‌మెంట్‌లో తమన్నా!

by Jakkula Samataha |   ( Updated:2021-03-18 04:55:58.0  )
శేఖర్ కమ్ములను కలిసిన ఎగ్జైట్‌మెంట్‌లో తమన్నా!
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకులు శేఖర్ కమ్ములను కలిసింది. తన లైఫ్‌లో హ్యాపీడేస్ ప్రారంభించిన వ్యక్తిని చాలా రోజుల తర్వాత మీట్ అయ్యానని తెలిపిన తమన్నా.. తనను కలిసిన ఎగ్జైట్‌మెంట్‌లో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నానని తెలిపింది తమూ. ‘శ్రీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సక్సెస్‌తో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలో స్టార్ రేంజ్‌కు దూసుకెళ్లిన మిల్కీ హీరోయిన్.. ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు ‘ఆహా’లో ప్రసారం కానున్న ‘లెవెన్త్ హవర్’ సిరీస్, ‘ఎఫ్ 3’ షూటింగ్స్‌తో బిజీగా ఉంది.

Advertisement

Next Story