చైనాతో చర్చలు చేస్తున్నాం: రాజ్‌నాథ్ సింగ్

by Shamantha N |
చైనాతో చర్చలు చేస్తున్నాం: రాజ్‌నాథ్ సింగ్
X

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల సైన్యాల మోహరింపుతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆదివారం తొలిసారిగా కేంద్రమంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ఉద్రిక్తతలు సమసిపోయేలా ఇరుదేశాల మధ్య మిలిటరీ, డిప్లమాటిక్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతల విషయంలో భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ తన సార్వభౌమత్వానికి భంగం వాటిల్లకుండా చూసుకుంటుందని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంపై మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి చైనా, భారత్‌ల మధ్య తగిన వ్యవస్థ ఉన్నదని, డోక్లాం సమస్యనూ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉద్రిక్తతలు తగ్గడంపైనే భారత్ దృష్టిపెట్టిందని, పొరుగుదేశాలతో సఖ్యంగా మెలగే విధానాన్నే భారత్ ఏళ్లుగా అనుసరిస్తున్నదని చెప్పారు. ఈ ఉద్రిక్తతల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చైనా చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తూర్పు లడాఖ్‌లోని పాంగాంగ్ సో, గాల్వాన్ లోయ, డెంచక్, డౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతాల్లో ఇరుదేశాల జవాన్లు మధ్య మూడువారాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed