తాలిబన్లు శవాలతో కూడా ‘సెక్స్’ చేస్తారు.. ఆఫ్ఘన్ మహిళా పోలీస్ సంచలన కామెంట్స్

by Sumithra |   ( Updated:2021-08-26 05:06:29.0  )
talibans
X

దిశ, వెబ్‌డెస్క్ : తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక అక్కడ నెలకొన్న పరిస్థితులను మనం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వచ్చే కథనాలు, వీడియోల రూపంలో తెలుసుకుని ఉంటాం. అది కేవలం ఒక వార్త లాగానే మనకు గుర్తుండిపోతుంది. కానీ, ఆఫ్ఘన్‌లోని పోలీసు విభాగంలో పని చేసిన ఓ మహిళ తాలిబన్ల అరాచాలను కళ్లకు కట్టినట్టు వివరించింది. అంతేకాకుండా, అక్కడే ఉంటే తనకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరికలు రావడంతో కుటుంబంతో సహా ఇండియాకు శరణార్థిగా వచ్చి ప్రాణాలను రక్షించుకుంది.

దేశానికి చెందిన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ముస్కాన్’ అనే ఆఫ్ఘన్ పౌరురాలు మాట్లాడుతూ.. ఆ దేశంలో మహిళలు, పిల్లలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పింది. తాలిబాన్లు ప్రభుత్వాన్ని కూల్చివేసి దేశాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్న చాలా మంది ప్రజలు అక్కడి నుంచి ఇతర దేశాలకు పారిపోయారు. అందులో పోలీసులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తాను ఆఫ్ఘనిస్తాన్‌లోని పోలీసు దళంలో పనిచేశానని, తాలిబన్ల నుంచి తమ కుటుంబానికి బెదిరింపులు రావడంతో ఉద్యోగం వదిలేసి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇండియాకు వచ్చినట్టు సమాధానం ఇచ్చింది.

తాలిబన్లు క్రూరమైన వారని.. చెప్పినట్టు వినకపోతే చంపేస్తారని తెలిపింది. అంతేకాకుండా ప్రతీ ఇంట్లోని మహిళలు, యువతులు, చిన్న పిల్లలపై కన్నేస్తారని తెలిపింది. వారికి లొంగకపోతే చంపేసి మృతదేహాలతో కూడా ‘శృంగారం’ చేస్తారని గద్గదస్వరంతో బదులిచ్చింది. ‘‘ మనిషి చనిపోయాడా లేదా సజీవంగా ఉన్నాడా..? అనే విషయాన్ని వారు పట్టించుకోరు.. మీరు దానిని ఊహించగలరా..?’’ అని అడిగింది. శవాలతో సెక్స్ చేసే పద్ధతిని ‘నెక్రోఫిలియా’ అంటారని.. దీనిని తాలిబన్లు అందరూ ఆచరిస్తారని వెల్లడించింది.

మహిళలు బయట కనిపించినా.. బురఖా ధరించకపోయినా.. ఎత్తుకెళ్తారని లేదా కాల్చి చంపేస్తారని ముస్కాన్ స్పష్టం చేసింది. ఓ జిహాదీ గ్రూపు తనను చాలా బెదిరించిందని.. ఆడవారు పనికి వెళితే వారితో పాటు కుటుంబాన్ని కూడా వారు టార్గెట్ చేస్తారు. తాలిబన్లు ఒక్కసారి మాత్రమే హెచ్చరిక చేస్తారు. ఆ తర్వాత హెచ్చరికలు లేకుండా నేరుగా చంపేస్తారని తెలిపింది. చివరగా ఎవరైనా మహిళా ఉద్యోగి వారికి దొరికితే వారు చాలా నరకాన్ని అనుభవించాల్సి ఉంటుందని ముగించింది.

Advertisement

Next Story