- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మాహుతి సభ్యులతో తాలిబన్ల కవాతు
దిశ వెబ్‌డెస్క్: తాలిబన్ల బుద్ధి ఏ మాత్రం మారలేదని మరోసారి తేటతెల్లమయింది. అమెరికాను ఓడించినట్లు ప్రకటించుకున్న తాలిబన్లు, శుక్రవారం భారీ తాలిబన్ల సైనిక కవాతును నిర్వహించారు. ఇందులో వివిధ సైనిక వాహనాలతో పాటు, ఆత్మాహుతి దళ సభ్యులు బాంబులతో నిండి ఉన్న జాకెట్లను ధరించి మరీ కవాతులో పాల్గొని భయం పుట్టించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో కాందహర్‌లో తీసినట్లు అనుమానాలున్నాయి.
ఓ వేదిక ముందు కొంతమంది తాలిబన్ల నాయకులు కూర్చుని ఉండగా, వారి ముందు ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు కశ్మీర్ విషయంలో తాలిబన్లు మాట మార్చినట్లు తెలుస్తోంది. బీబీసీతో మాట్లాడిన ఓ నేత ‘కశ్మీర్ విషయంలో ముస్లింలా పక్షాన మా గొంతు వినిపిస్తాం’ అంటూ బాంబు పేల్చారు. అయితే ‘ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ ఆపరేషన్లు నిర్వహించడానికి మాత్రం అనుమతించం ’ అంటూ చెప్పుకొచ్చారు.
Tal!ban’s Republic Day Parade
Proudly displaying suic!de vests, which the narrator boasts are a key weapon in the country’s arsenal.😭😭😭
— 𝓐𝓻𝓬𝓱𝓲𝓮 (@archersaggi) September 3, 2021
- Tags
- military