- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు పడుతుంది: తలసాని సంచలన వ్యాఖ్యలు
by Ramesh Goud |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బానిస అనడం భావ్యం కాదని, ఇది ఈటల రాజేందర్ అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. ఆ నాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే అన్నారు. ఈటల హుజురాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ అంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుందని.. గతంలో సుమన్, కిశోర్ లాంటి వాళ్లకు పార్టీ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. జానారెడ్డికి పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుందని జోస్యం చెప్పారు.
Advertisement
Next Story