- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో ఓటమిపై తలసాని సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: స్వయం కృతాపరాధంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయామని, అయినప్పటికీ ఎక్కువ డివిజన్లలో కార్పొరేటర్లను గెల్చుకుని మేయర్, డిప్యూటీ మేయర్ లను దక్కించుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ బ్రష్టుపట్టించేలా పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఉపన్యాసాలను ఎవరూ వినేటట్టు లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. గ్రేటర్ లో, రాష్ట్రంలో సమస్య ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించిన తలసాని.. ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రతిపక్షాలు ఏది మాట్లాడితే అది పేపర్లు రాస్తున్నాయని, భవనాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు మాట్లాడింది కాకుండా వాస్తవం గ్రహించి రాయాలని సూచించారు. పేదవాడు గౌరవంగా బతికేలా సీఎం కేసీఆర్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని, అందువల్ల నిర్మాణంలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే హైదరాబాద్ లో తిరగరని హెచ్చరించారు.
- Tags
- GHMC