- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ను అరెస్ట్ చేసేంత దమ్ముందా: తలసాని
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆకుపాములలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వరద ముంపునకు గురైన కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించకుంటే ప్రజలే మీ పై తిరగబడతారని తలసాని హెచ్చరించారు. దేశం గర్వపడే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. కేవలం రెండు ఎన్నికల్లో గెలుపు తోటే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారన్నారు. టీఆర్ఎస్ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మరవొద్దని చురకలు వేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసుకొనేందుకు వినియోగించాలని మంత్రి హితవు పలికారు. కానీ, పదే పదే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామంటున్న బండి సంజయ్‌కు అంత ధైర్యం ఉందా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూటి ప్రశ్న వేశారు.