అదనపు డీజీపీలుగా బాధ్యతలు స్వీకరణ

by Shyam |
అదనపు డీజీపీలుగా బాధ్యతలు స్వీకరణ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ఇటీవల ప్రమోషన్ పొందిన ఐపీఎస్‌లు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేశ్ భగవత్‌లు సోమవారం అదనపు డీజీపీలుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రమోషన్ పొందిన నలుగురు అధికారులకు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టుల్లోనే తిరిగి నియామకం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా వీవీ శ్రీనివాసరావు, షీ టీమ్స్ భద్రతా విభాగంలో స్వాతి లక్రా, రాచకొండ సీపీగా మహేశ్ భగవత్ కొనసాగనున్నారు.

Advertisement

Next Story