- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ రెడ్డిని కలిసిన డీకే అరుణ.. ఎందుకంటే ?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దేశంలో ఐదవ శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ దేవాలయం అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అందజేసిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే అరుణ ఇటీవల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన సాంస్కృతిక, వారసత్వ సంపద, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించిన నేపథ్యంలో అలంపూర్ జోగులాంబ దేవాలయంలో కనీస సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టి సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అరుణ మంత్రికి విన్నవించారు. జూరాల ప్రాజెక్టును బృందావనం గా మారుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి పనులను ఆరంభించిన పాపాన పోలేదన్నారు. జూరాల వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూపొందించాలని కేంద్రమంత్రికి డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.