- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జలవివాదంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి’
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణా జల వివాదంపై వెంటనే సీఎం జగన్ అఖిలపక్షాన్ని ప్రధాని, జలశక్తి మంత్రి వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పొలాలకు పారాల్సిన కృష్ణా జలాలు నేడు సముద్రం పాలవుతున్నాయంటే అందుకు కారణం జగన్ అసమర్థతేనని ఆరోపించారు. శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తుంటే సీఎం జగన్ లేఖలో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లే సీఎం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతున్నప్పుడు ఎందుకు పీఎం, జలశక్తి మంత్రిని కలవట్లేదని నిలదీశారు.
అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే కపటనాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి శ్రీశైలంలో నీటి హక్కుల్ని కాపాడలేక చేతులెత్తేసి పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మరోవైపు తూర్పుగోదావరి- విశాఖ సరిహద్దులో లాటరైట్, బాక్సైట్ మాఫియా కోసం ఫారెస్టు చట్టాల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రూ.15 వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాడేపల్లి గ్యాంగ్‌రేప్ నిందితులు ఆళ్ల అనుచరులు కాబట్టే అరెస్ట్ చేయలేదనే అనుమానాలు ఉన్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.