జెండర్ టెస్ట్ కోసం.. కోర్టు మెట్లెక్కిన తాప్సీ

by Shyam |   ( Updated:2023-12-14 14:51:12.0  )
thapsi
X

దిశ, సినిమా : తాప్సీ పన్ను బాలీవుడ్ ఫ్యూచర్‌గా మారబోతుందా? అంటే తను ఎంచుకుంటున్న సినిమాలు, సక్సెస్ అవుతున్న విధానం, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఔననే సమాధానం ఇస్తోంది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘హసీన్ దిల్‌రుబా’ సినిమాతో భేష్ అనిపించుకున్న తాప్సీ.. అప్ కమింగ్ ప్రాజెక్ట్ తాజాగా విడుదలైన ‘రష్మి రాకెట్’ ట్రైలర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. చిన్ననాటి నుంచి ఇండియాకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకునే ఓ అథ్లెట్.. జెండర్ టెస్ట్‌తో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది? ఆ చాంపియన్ న్యాయం కోసం ఎలా పరుగెత్తింది? ఇండియన్ న్యాయ వ్యవస్థను ఎలా చాలెంజ్ చేసి గెలిచింది? అనేది ‘రష్మి రాకెట్’ కథ అని తెలుస్తుండగా.. తాప్సీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, అమేజింగ్ యాక్టింగ్‌ స్కిల్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, మ్యాంగో పీపుల్ ఇండియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకుడు కాగా.. అక్టోబర్ 15న జీ5లో రిలీజ్ కాబోతోంది.

Advertisement

Next Story