- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ తీర్పు చూసి ఎలా రియాక్ట్ కావాలో తెలియడం లేదు: తాప్సీ
దిశ, వెబ్ డెస్క్: ఇండియా గర్ల్ చైల్డ్ డే సెలెబ్రేట్ చేసుకుంటుండగా..హీరోయిన్ తాప్సీ పన్ను బాంబే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఓ తీర్పును సోషల్ మీడియాలో షేర్ చేసింది. న్యాయస్థానం ఇలాంటి తీర్పులు ఇస్తే అసలు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కావడం లేదంది. ఇలాంటి న్యాయవ్యవస్థ కలిగిన దేశంలో బాలికల దినోత్సవం జరుపుకోవడానికి అర్థమే లేదని అభిప్రాయపడింది.
ఇంతకీ విషయం ఏంటంటే బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఆడపిల్లను కేవలం పట్టుకోవడం అనేది లైంగిక వేధింపుల కిందకి రాదని, లైంగిక ఉద్దేశంతో శారీరక సంబంధం కలిగి ఉంటేనే అది వేధింపుల కిందకి వస్తుందని తెలిపింది. మైనర్ చెస్ట్ తాకడం అనేది సెక్సువల్‌గా వేధించడం కిందకు కాదని.. నిందితుడు బాలిక ధరించిన దుస్తులు విప్పేసి టచ్ చేస్తేనే అది నేరం అవుతుందని తేల్చింది. కాగా, ఈ తీర్పుని.. ప్రభుత్వ సోషల్ మీడియా హ్యాండిల్‌కి ట్యాగ్ చేయాలని తాప్సీని కోరుతున్నారు నెటిజన్లు. ఇలాంటి న్యాయమూర్తులు ఉంటే దేశం ఏమైపోతుంది? ఆడ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
Are you f-ing kidding me? pic.twitter.com/BBaOQfYdDG
— June Paul (@journojuno) January 23, 2021