- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే మాకు కలిసొచ్చింది.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, బాబార్‌లు భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చాకచక్యంగా రాణించారు. ఎక్కడా తడబడకుండా భారత్ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కీలక వికెట్లు పడగొట్టడం మాకు కలిసొచ్చింది. మేము అనుకున్న వ్యుహాలను సమర్థవంతంగా అమలు చేశాం. షహీన్ బౌలింగ్ మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. స్పిన్నర్లు సైతం అద్భుతంగా రాణించారు. ఈ విజయం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ మ్యాచ్‌కు ముందు గత రికార్డు గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోవాలనుకోలేదు అని బాబార్ అజామ్ వెల్లడించారు.