- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 వరల్డ్ కప్.. ఇదే ఐసీసీ ప్లాన్
దిశ, స్పోర్ట్స్: భారత్ వేదికగా అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కావల్సిన పురుషుల టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఈకి మార్చడానికి ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రేపు(జూన్ 28) టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. అంతకు ముందే ఐసీసీ వేదికలతో పాటు ప్రాథమిక షెడ్యూల్ కూడా ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కావల్సిన టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కుల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి జూన్ 28 వరకు గడువు ఉన్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇండియాలో ఈ మెగా టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ భావించడంతోనే టోర్నీ షెడ్యూల్ ప్రకటించారు. ఇదే విషయాన్ని బీసీసీఐకి అనధికారికంగా కూడా చెప్పినట్లు తెలుస్తున్నది. దీనికి బోర్డు కూడా ఒప్పుకున్నదని.. మరో రెండు రోజుల్లో అధికారికి ప్రకటన వెలువరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్ ముగిసిన వెంటనే..
బీసీసీఐ నిర్వహించనున్న ఐపీఎల్ ఫైనల్ అక్టోబర్ 15న జరుగనున్నది. ఆ తర్వాత రెండు రోజులకే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. అయితే మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను ఒమన్‌తో పాటు యూఏఈ లోని ఇతర స్టేడియంలలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 24 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు యూఏఈలోని మెయిన్ స్టేడియంలలో ప్రారంభం కానున్నాయి. ఒమన్, యూఏఈ వేదికగా నిర్వహించే 12 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో 8 జట్లు తలపడతాయి. రెండు గ్రూపులుగా విడగొట్టి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటిలో నుంచి నాలుగు జట్లు సూపర్ 12కు క్వాలిఫై అవుతాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్. నెదర్లాండ్స్. స్కాట్లాండ్. నమీబియా. ఒమన్. పపువా న్యూ గినియా జట్లు ఆడనున్నాయి. ఈ క్వాలిఫయర్స్‌లోని రెండు గ్రూప్స్‌లో టాప్ రెండు జట్లను సూపర్ 12 మ్యాచ్‌లకు ఎంపిక చేస్తారు. ఆ నాలుగు జట్లు.. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో ఉన్న టాప్ 8 జట్లతో కలిపి సూపర్ 12 మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో నిర్వహించనున్నారు.
కో-హోస్ట్ ఎవరు?
టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నిర్వహించాలని ఇప్పటికే ఐసీసీ నిర్ణయించింది. యూఏఈ, ఒమన్ వేదికల్లో ఈ మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు నిర్వహించనున్నారు, వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ ఆతిథ్యపు హక్కులు బీసీసీఐ వద్ద ఉన్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా యూఏఈకి వేదికను మార్చడంతో ఎవరు హోస్ట్ గా ఉంటారనే అనుమానాలు నెలకొన్నాయి. మొదట్లో తమకు కో-హోస్ట్ హక్కులు ఇస్తే వేదికను యూఏఈతో పంచుకోవడానికి ఒప్పుకుంటామని బీసీసీఐ చెప్పింది. కానీ ఇప్పుడు బీసీసీఐ అనుమతి లేకుండానే ఐసీసీ తమ మెగా ఈవెంట్ వేదికను మార్చేసింది. జూన్ 28న బీసీసీఐ టీ20పై తేల్చి చెప్పే కారణాన్ని బట్టే ఆతిథ్యపు హక్కులపై తుది నిర్ణయం ఉంటుందని ఐసీసీ అధికారి ఒకరు చెప్పారు. కరోనా మహమ్మారి కనుక లేకపోయినట్లయితే ఇండియాలోని 9 నగరాల్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేయాలని భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలడంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు మెగా ఈవెంట్‌కు సంబంధించిన ట్యాక్స్ సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ అనుమానాలన్నింటికీ జూన్ 28 తర్వాతే తెరపడనున్నది.