- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటీ పరీక్షల అభ్యర్థులకు T-SAT గుడ్‌న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లు పాఠ్యాంశాల ప్రసారాలు చేయనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న ప్రత్యక్ష ప్రసారాలతో ప్రారంభించనున్నారు. 27 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో సుమారు 12,328 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అంశాలను బోధించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ ద్వారా 040-23540326, 23540726, టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈఓ సూచించారు. జనరల్ ఇంగ్లీష్, ఇంటిలిజెన్స్, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూట్, జనరల్ అవేర్ నెస్ అండ్ స్టాట్స్ కు సంబంధించిన ఐదు సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలను సుమారు 75 రోజుల పాటు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.