- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న టిప్పర్...

దిశ,పటాన్ చెరు : ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ దుర్మరణం చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరి (32) తన భార్య రమాదేవి (30), కుమారుడితో కలిసి ఇస్నాపూర్ లో నివాసం ఉంటూ స్థానికంగా ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన భార్య రమాదేవి తన కుమారుడితో కలిసి బైక్ పై తన ఇంటికి వెళ్తుండగా ఇస్నాపూర్ లో వెనకనుంచి టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మృతురాలి పైనుంచి టిప్పర్ దూసుకుపోవడంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజుగా మారింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో పటాన్ చెరు పోలీసులు రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.