- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విగ్రహాలకి తొలిగిన ముసుగు.. శిలాఫలకాలపై తొలగని ముసుగు..

దిశ,తల్లాడ : రాజకీయ నాయకుల విగ్రహాలపై తొలగిన ముసుగు.. శిలాఫలకాలపై తొలగని ముసుగు తల్లాడ మండల అధికారులు తీరు విడ్డూరంగా ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 8వ తేదీన ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే కానీ తల్లాడ మండల అధికారులు మాత్రం తెలియకపోవడం నవ్వు తెప్పిస్తుంది అలాగే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలపై శంకుస్థాపన శిలాఫలకాలపై ముసుగులు వేయడం ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించినది కానీ కోడ్ ముగిసిన అనంతరం విగ్రహాలపై శిలాఫలకాలపై ముసుగులు తీయాలి కానీ తల్లాడ మండలంలోని మాత్రం ఇంకో తీరుగా కనిపిస్తుంది.
దిశ పేపర్ లో కోడ్ ముగిసిన తొలగిన ముసుగులు అనే కథనం ప్రచురించడం జరిగింది. ఇది ఇలా ఉంటే అధికారులు పేపర్ లోనే వస్తే తప్ప కోడ్ ముగిసింది అని అధికారులకు తెలియదా అంటున్న ప్రజలు.కానీ అధికారులు మాత్రం రాజకీయ నాయకుల విగ్రహాలపై ముసుగులు తొలగించిన శిలాఫలకాలపై మరియు శంకుస్థాపన దిమ్మలపై ఇంకా ముసుగులు ఎందుకు తొలగించలేదు ఆశ్చర్యంగా ఉంది. దీని చూసి ప్రజలు ఏమంటున్నారంటే విగ్రహాలకు తొలగిన ముసుగులు.. శిలాఫలకాలపై ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉందా అందుకే శిలాఫలకాలపై ముసుగులు తొలగించలేదా ఇదేమిటోమని ప్రజలు నవ్వుతున్నారు.ఇదేమైనా మండలాధికారుల తీరు బాగాలేదని తెలుస్తూనే ఉంది.