ముగ్గురం ఒక చోట ఉంటే భయమెందుకు: ఉత్తమ్

by Shyam |
ముగ్గురం ఒక చోట ఉంటే భయమెందుకు: ఉత్తమ్
X

దిశ, నల్లగొండ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కృషి వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం అరెస్ట్ చేసి అవమానించిందన్నారు. పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినా సీఎం కేసీఆర్​కి కనీసం సోయి లేకుండా పోయిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద వేల మంది ఉండొచ్చు కానీ ముగ్గురు సీనియర్ నాయకులం ఒక్క దగ్గర ఉంటే కేసీఆర్​కి ఎందుకంతా భయమవుతుందో చెప్పాలన్నారు. ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్ట్ పేరు వినబడగానే సీఎం ఎందుకు భయపడుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద పూర్తి చేశారన్నారు. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాదని, బ్లాక్​ డే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్ నియంతపాలనకు చరమగీతం తప్పదని హెచ్చరించారు. దేవరకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం వెళ్తుంటే తమను అరెస్ట్ చేడంపై ముగ్గురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed