- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటరాజన్ మోకాలి సర్జరీ పూర్తి
దిశ, స్పోర్ట్స్: టీమిండియా యార్కర్స్ సంచలనం తంగరసు నటరాజన్ మోకాలి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. గత వారం గాయం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరమైన నటరాజన్‌కు గురువారం వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఈ సీజన్ మొత్తానికి నటరాజన్ దూరమవుతాడని బీసీసీఐ ప్రకటించింది.
‘ఈ రోజు నాకు శస్త్రి చికిత్స చేశారు. అనుభవజ్క్షులు, దయ కలిగిన వైద్య బృందం, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. బీసీసీఐకి నా ధన్యవాదములు. నేను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదములు’ అని నటరాజన్ ట్విట్టర్‌లో ఒక మెసేజ్ పోస్టు చేశారు.
కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన అనంతరం ఆస్ట్రేలియా టూర్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అనూహ్యంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. అప్పుడు మోకాలి గాయం అయ్యింది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. అయితే మ్యాచ్ ఆడటానికి తగినంత ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది పరీక్షించకుండానే ఇంగ్లాండ్ సిరీస్ ఆడించారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. గాయం నుంచి కోలుకోవడానికి తగినంత సమయం లేకుండా పని భారం ఎక్కువవడంతోనే నటరాజన్‌కు శస్త్ర చికిత్స అవసరమైందని నిపుణులు చెబుతున్నారు.