- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ-హబ్ ఆధ్వర్యంలో 4 రోజుల 'ఇన్నోవేషన్ సమ్మిట్'
దిశ, వెబ్‌డెస్క్: స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే ప్రముఖ టీ-హబ్ దాని ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం(నవంబర్ 23) నుంచి నాలుగు రోజుల పాటు ఇన్నోవేషన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా ఎదుగుదల కోరుకునే ఆంత్రప్రెన్యూర్‌లకు, కొత్త ఇన్నోవేషన్లకు మద్దతిచ్చేందుకు ‘వన్న్ ఎకోసిస్టమ్’ ఏర్పాటు లక్ష్యంగా జరగనుంది. ఈ కార్యక్రమమంలో ప్రముఖులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, విద్యావేత్తలను ఒకచోటకు చేరుస్తుందని, వారి నుంచి ఈ ఎకోసిస్టమ్ నిర్మాణంలో సహకారం అందుకోనున్నట్టు’ టీ-హబ్ ప్రతినిధి చెప్పారు.
సెంద్రియా వృద్ధి వర్సెస్ అకర్బన వృద్ధి, ఆంత్రప్రెన్యూర్ల మనస్తత్వం ఎదుగుదల, పెట్టుబడిదారులకు అవసరమైన అంశాలు, మహిళల పారిశ్రామికవేత్తల పునరుజ్జీవనం వంటి విషయాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు టీ-హబ్ ప్రతినిధులు వివరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎండియా పార్ట్‌నర్స్ డైరెక్టర్ అభిషేక్ శ్రీవాస్తవ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ రిచ్ అజిత్, వ్యూ హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీప్తి రావుల ప్రసంగించనున్నారు.