- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వర్ణ ప్యాలస్ ఘటనలో విస్తుపోయే నిజాలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక అందించింది. రమేష్ హాస్పిటల్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ధృవీకరించారు. కోవిడ్ సెంటర్ కోసం కేంద్రం ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించారని, డబ్బు సంపాదనే ధ్వేయంగా చట్టాలను పట్టించుకోలేదని కమిటీ స్పష్టం చేసింది.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్ అనుమానితులతో పాటుగా వైరస్ సోకని వారిని కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని తెలిపింది. అవసరం లేకున్నా రెమిడెసివర్ పేషెంట్లకు వాడారని నివేదికలో పేర్కొన్నారు కమిటీ అధికారులు. అంతేకాదు రమేష్ హాస్పిటల్ లో అనుమతి లేకుండా ప్లాస్మా థెరపీ కూడా చేశారని కమిటీ వెల్లడించింది.
ఎలాంటి అనుమతులు లేకుండా ఎం- 5, మెట్రోపాలిటన్ హోటళ్లలో రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించిందని చెప్పింది. అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు లేవని విచారణ కమిటీ తేల్చింది. స్వర్ణ ప్యాలెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండా ముందుగానే కోవిడ్ చికిత్స పేరుతో పేషెంట్లను అక్కడ ఉంచినట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు.