‘ప్రజాక్షేత్రంలో ప్రజాబంధు’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ కోసం ర్యాలీ

by Shyam |
‘ప్రజాక్షేత్రంలో ప్రజాబంధు’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ కోసం ర్యాలీ
X

దిశ, వాజేడు: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో స్వేరో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు వెంపల్లి వీరస్వామి ఆధ్వర్యంలో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్‌కి స్వాగత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గుండాల రఘు, నరేష్, శ్యామ్, రాజాబాబులు మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి బస్టాండ్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బహుజన నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని.. ప్రజాక్షేత్రంలోకి పేద బడుగు బలహీన వర్గాల కోసం రావడం సంతోషకరమైన విషయం అన్నారు. అందుకే, ఏటూరునాగారం మండల కేంద్రం ఐటీడీఏ నుంచి బస్టాండ్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు.

Advertisement

Next Story