- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సహజీవనం చేస్తున్న యువతి అనుమానాస్పద మృతి..
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్ల గ్రామానికి చెందిన మన్నీ విజయవాడ లయోలా కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తరుణ్‌తో మున్నీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో 20 రోజులుగా మున్నీ, తరుణ్ ఒకే గదిలో ఉంటున్నారు.
అయితే సోమవారం మున్నీ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. మున్నీని మాచవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాడు తరుణ్. అయితే అప్పటికే యువతి మరణించిందని తెలియడంతో తరుణ్ నేరుగా మాచవరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలు బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ కుమార్తెను తరుణ్ కొట్టి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
- Tags
- Death