తెల్లవారుజామున ఆ పని చేసిన మహిళ.. షాక్‌లో కుటుంబ సభ్యులు..

by Sumithra |
తెల్లవారుజామున ఆ పని చేసిన మహిళ.. షాక్‌లో కుటుంబ సభ్యులు..
X

దిశ, చండూర్ : వివాహిత అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నకిరేకంటి అశ్విని (25) గురువారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణాలని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గ్రామానికి చేరుకోకముందే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులే ఫ్యాన్ కు ఉరి వేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి అశ్వినికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఏడు నెలల బాబు ఉన్నాడు. మృతురాలి ఇంటివద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా, చండూర్ ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story