- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేసుకున్న తమ్ముడి హత్య.. ఆ అనుమానంతో ఫిర్యాదు చేసిన అన్నలు
దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ప్రేమ వివాహం చేసుకున్నాడని గుర్తుతెలియని వ్యక్తులు ఒకరిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేసిన విషాద సంఘటన చింతగూడెంలో చోటు చేసుకుంది. గజ్జల రామారావు 24 అనే యువకుడిని బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోనుండి శ్మశాన వాటిక స్థలానికి బలవంతంగా తీసుకెళ్లారు. అతన్ని ముందుగా కర్రలతో చితకబాదారు. ఎట్టకేలకు రామారావును హతమార్చాలని వచ్చిన ఆ గుర్తు తెలియని వ్యక్తులు కింద పడవేసి గొడ్డలితో నరకగా మెడ భాగంలో, తల భాగంలో, వీపు భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఐ సట్ల కిరణ్ కుమార్, ఎస్సై చరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతోనే తమ సోదరుడిని చంపేసి ఉంటారని ఆరోపిస్తూ సోదరులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.